తిమ్మాపూర్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టిన ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి చెందా డు. ఈ ఘటన మండలంలోని మ హాత్మానగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన రాణాప్రతాప్(28), అర్జున్ చిగురుమామిడి వెళ్లి, ఆదివారం రాత్రి 8గంటలకు కరీంనగర్ వెళ్తున్నారు. మహాత్మానగర్ శివారులో రోడ్డు దాటుతున్న ఆర్టీసీ ఉద్యోగి కోటిరెడ్డిని ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో రాణా ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అర్జున్, కోటిరెడ్డిని 108లో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రాణా ప్రతాప్‌కు పదిరోజుల క్రితమే వివాహమైనట్లు తెలిసింది.
బండరాళ్లుపడి పొక్లెయిన్ ఆపరేటర్..
జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని పెద్దాపూర్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్‌లో బండరాళ్లు పడి పొక్లెయిన్ ఆపరేటర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన తోట రాజశేఖర్‌రెడ్డి(35) కొంతకాలంగా శ్రీవెంకటేశ్వర స్టోన్ క్రషర్‌లో పొక్లెయిన్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం క్వారీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు బండరాళ్లు మీద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ప్రధాన వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్ రోడ్డుప్రమాదం
● గోదావరిఖని వాసుల మృతి
గోదావరిఖని(రామగుండం): హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని బాపూజీనగర్‌కు చెందిన మర్రి ప్రశాంత్– శ్రావణి మృతిచెందారు. ప్రశాంత్ హైదరాబాద్ రాంనగర్‌లో నివాసముంటూ ప్రైవేటు మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో మోటార్ సైకిల్‌పై బోడుప్పల్‌లో ఉండే సోదరి ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొనడంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా, శ్రావణి త్రీవగాయాలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. కాగా ఈ ప్రమాదం నుంచి 10 సంవత్సరాల కుమారుడు సహ్రస్తాన్ బయటపడ్డాడు.


