మిషన్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మిషన్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

Mar 16 2026 7:39 AM | Updated on Mar 16 2026 7:39 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లి మండలం బావుపేటలోని సెవెన్‌ హిల్స్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న బిహార్‌ రాష్ట్రం కిషన్‌గంజ్‌ జిల్లా బహద్దూర్‌గంజ్‌ నియోజకవర్గానికి చెందిన ఎండీ ముఖీమ్‌(32) శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సీఐ బిల్లా కోటేశ్వర్‌ తెలిపారు. ముఖీమ్‌ ఫ్యాక్టరీలోని రేకుల షెడ్డు ఇనుప పైప్‌లకు ఉరేసుకొని మృతి చెందినట్లు తోటి కార్మికులిచ్చిన సమాచారం మేరకు పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడు తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడని, ఎవరో వేధింపులకు గురి చేయడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడు తండ్రి మసూద్‌ ఆలం బిహార్‌ నుంచి వచ్చి ఆదివారం పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

రైలు కిందపడి ఒకరు..

జమ్మికుంట: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. జమ్మికుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో కొత్తపల్లికి చెందిన వడ్లకొండ విజయ్‌కృష్ణ(40 అరటిపండ్లు అమ్మకొని జీవనం సాగిస్తుంటాడు. వివాహం కాగా భార్య విడాకులిచ్చింది. కాలంగా మానసిక పరిస్థితి బాగాలేక చికిత్స పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రామగుండం రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ గంగారపు తిరుపతి తెలిపాడు.

యువకుడు..

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌ యైటింక్లయిన్‌కాలనీ సంతోష్‌నగర్‌కు చెందిన నిమ్మతి అజయ్‌(20) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని టూటౌన్‌ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సంతోష్‌నగర్‌లో నివాసం ఉండే నిమ్మతి స్వరూప భర్త 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్వరూప కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించింది. మధ్యలోనే చదువు మానేసిన అజయ్‌ డెకరేషన్‌ పనులు చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె తనను ఇష్టపడడం లేదని గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన అజయ్‌ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement