తొలిరోజు ప్రశాంతం
కరీంనగర్‌టౌన్: ఇంటర్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ జనరల్ విభాగంలో 13,851 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 288 మంది గైర్హాజరయ్యారు. 13,563 మంది పరీక్ష రాశారు. ఒకేషనల్ విభాగంలో 1,538 మందికి 112మంది గైర్హాజరయ్యారు. 1,426మంది పరీక్ష రాశారు. మొత్తంగా 15,389 మంది పరీక్షలు రాయాల్సి 400 మంది గైర్హాజరయ్యారు. 14,989 మంది పరీక్షలు రాశారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముకరంపురలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, హాల్ టికెట్ల తనిఖీ, బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. సీపీ గౌస్ ఆలం పలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాను పరిశీలించారు.
తొలిరోజు ప్రశాంతం


