విచారణ జరపండి | - | Sakshi
Sakshi News home page

విచారణ జరపండి

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

విచార

విచారణ జరపండి

విచారణ జరపండి ● ‘డ్రైవర్‌ సీటు’ వసూళ్లపై మేయర్‌ సీరియస్‌ ● విచారణకు ఆదేశం విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ నాణ్యమైన న్యాయవిద్య అందరికీ అవసరం హాయ్‌.. టీజీఎన్‌పీడీసీఎల్‌ ● 7901628348 వాట్సాప్‌ నంబరులో ఫిర్యాదుల స్వీకరణ

● ‘డ్రైవర్‌ సీటు’ వసూళ్లపై మేయర్‌ సీరియస్‌ ● విచారణకు ఆదేశం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ పోస్టులు ఇప్పిస్తామంటూ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల నుంచి రూ.30 వేల చొప్పు న వసూలు చేసిన ఉదంతంపై మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ సీరియస్‌ అయ్యారు. ‘డ్రైవర్‌ సీటు రూ.30 వేలు’ పేరిట బుధవారం ‘సాక్షి’ లో వచ్చిన కథనంతో విచారణకు ఆదేశించా రు. నగరపాలకసంస్థ కార్యాలయంలో కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌తో కలిసి పారిశుధ్యంపై నిర్వహించిన సమీక్షలో ‘సాక్షి’ కథనాన్ని ప్రస్తావించారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను కొత్త ట్రా క్టర్లపై డ్రైవర్లుగా నియమిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున రూ.10.50 లక్షలకు బేరం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌కి సూచించారు. ఇలాంటి చేతివాటాలు ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కరీంనగర్‌/విద్యానగర్‌/సప్తగిరికాలనీ: కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. కార్పొరేటర్లు పడిశెట్టి వసంత లక్ష్మి, మాసం గణేశ్‌, టేల భూమయ్య, మోహన్‌ యాదవ్‌, హేమంత్‌ యాదవ్‌, రవి, మెడికల్‌ వెంకన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవరం సతీశ్‌, ఉపాధ్యాయులు ఖదీర్‌, షఫీయోద్ధీన్‌ పాల్గొన్నారు.

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): నాణ్యమైన విద్య అందరికీ అవసరమని, న్యాయ విద్యార్థులు క్రమశిక్షణతో చదువు పూర్తి చేసుకొని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి తమ అవకాశాలు పెంచుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఉమేశ్‌ కుమార్‌ ఆకాంక్షించారు. బుధవారం వర్సిటీలో అమెరికా న్యాయరంగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. న్యాయవిద్యకు మన దేశంలోనే కాకుండా అమెరికాలో నూ డిమాండ్‌ ఉందన్నారు. ఇమిగ్రేషన్‌ అటర్నీ జనతారెడ్డి కంచర్ల మాట్లాడుతూ లీగల్‌ కోడింగ్‌తో ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవచ్చన్నారు. తెలంగాణ గ్లోబల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి న్యాయ కళాశాల పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి బంగారు పతకం బహుకరించడం ఆనందంగా ఉందన్నారు. రిజిస్ట్రార్‌ సతీశ్‌ కుమార్‌, అమెరికాలోని గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు విశ్వేశ్వర్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ పద్మావతి పాల్గొన్నారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): వినియోగదారులకు స త్వర విద్యుత్‌ సేవలు అందించడమే లక్ష్యంగా ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ముంగిట్లోకి తీసుకొచ్చింది. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సేవలు విస్తరిస్తోంది. ఇప్పటికే విద్యుత్‌ యాప్‌ ద్వారా సేవలందిస్తున్న సంస్థ మరింత వేగవంతంగా వినియోగదారులను చేరుకునేందుకు‘వాట్సాప్‌ చాట్‌ బాట్‌’అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ‘వాట్సాప్‌ చాట్‌ బాట్‌’ను వినియోగదారులు సద్వినియోగం చేసుకొని మెరుగైన సేవలు పొందాలని, దీంతో పాటు విద్యుత్‌ సంస్థ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912 సంప్రదించొచ్చని ఎస్‌ఈ గంగాధర్‌ వివరించారు.

విచారణ జరపండి
1
1/2

విచారణ జరపండి

విచారణ జరపండి
2
2/2

విచారణ జరపండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement