ఎలా చదువుతున్నారు? | - | Sakshi
Sakshi News home page

ఎలా చదువుతున్నారు?

Feb 25 2026 9:43 AM | Updated on Feb 25 2026 9:43 AM

ఎలా చదువుతున్నారు?

ఎలా చదువుతున్నారు?

ఎలా చదువుతున్నారు? మూడు రోజుల పాటు సర్వే

సామర్థ్యం పెంపే లక్ష్యం..

రెండో తరగతి విద్యార్థులకు అసెస్‌మెంట్‌

నేటి నుంచి మూడు రోజుల పాటు సర్వే

జిల్లాలో 53పాఠశాలలు ఎంపిక

సర్వేలో డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు

కరీంనగర్‌టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థుల ప్రాథమిక విద్యాసామర్థ్యాలను అంచనా వేసేందుకు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్టీ) తెలంగాణ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27 వరకు సర్వే చేపట్టనున్నారు. సర్వేలో పాల్గొనే డీఎడ్‌, బీఎడ్‌ విద్యార్థులకు సోమ, మంగళవారం ఎల్‌ఎండీలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థలో శిక్షణ ఇచ్చారు. ఎస్సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేయబడిన జిల్లాలోని 53 పాఠశాలలకు వెళ్లి 2వ తరగతి విద్యార్థుల తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ, గణితశాస్త్రం విషయాల్లో సామర్థ్యాలను పరిశీలించనున్నారు.

నేటి నుంచి 27 వరకు సర్వే

జిల్లాలో ఎంపిక చేయబడిన 50 ప్రాథమిక పాఠశాలలతో పాటు, 3 ఉర్ధూ మీడియం పాఠశాలల్లో మూడు రోజుల పాటు సర్వే చేపట్టనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారుల చదువు ఎలా సాగుతున్నాయో, బోధన పద్ధతులు, విద్యార్థుల పనితీరును టన్‌జెరిన్‌యాఫ్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వీటి నమోదుకు ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా 53 మంది డీఎడ్‌, బీఎడ్‌ విద్యార్థులను నియమించారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఉద్దేశం ఇదే

ఎన్‌ఐపీ 2020 ప్రకారం ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) వయసుకు తగ్గట్టుగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పొందేలా లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 నాటికి విద్యార్థులందరూ ప్రాథమిక నైపుణ్యాలను సాధించేలా చూడటం లక్ష్యం. అందుకు తగ్గట్టుగా జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ పనితీరు అంచనా వేయడానికి ఈ సర్వే దోహద పడనుంది.

2వ తరగతికి మాత్రమే..

రెండోతరగతి విద్యార్థులకు మాత్రమే సర్వే నిర్వహించనున్నారు. బొమ్మలు చూపిస్తూ మాట్లాడించడం, తెలుగు అక్షరాలు, పదాలు, వాక్యాలను గుర్తించడం, చదివించడం, అక్షరాలు, పదాలు రాయించడం, గణితంలో కూడిక, తీసివేత, గుణకా రం, బాగాహారం సామర్థ్యాలను పరీక్షిస్తారు. తెలు గు, ఆంగ్లం, గణితం, సబ్జెక్టులలో మౌఖిక సామర్థ్యం అక్షరాలు, పదాలు, వాక్యాలు ధారళంగా చదవడం, అర్థం చేసుకోవడం వంటివి పరిశీలిస్తారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలను మొబైల్‌యాప్‌లో సర్వే బృందం నమోదు చేయనున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక చదువు తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ, గణిత శాస్త్రం ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ శ్రీ న్యూమరిసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) విషయాల్లో సామ ర్థ్యాలను అంచనా వేయడానికి ఎస్సీఈఆర్టీ దృష్టి సారించింది. డీఎడ్‌, బీఎడ్‌ విద్యార్థులకు రెండు రోజుల పాటు శిక్షణ పూర్తి అయింది. నేటి నుంచి 27 వరకు జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో సర్వే జరగనుంది.

– కర్ర అశోక్‌రెడ్డి, అకాడమిక్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement