గిడ్డంగులతో రైతులకు మేలు
తిమ్మాపూర్: పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మండలంలో గిడ్డంగుల (గోదాముల) నిర్మించాలని నిర్ణయించిందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ తెలిపారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో 18,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం నూతన గోదాంల నిర్మాణ పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో ఇటీవల పలు విభాగాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణితో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, సర్పంచ్ గుజ్జుల శ్వేత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారు రమేశ్ పాల్గొన్నారు.


