భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బీజేపీ కార్పొరేటర్లు
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు మంగళవారం హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠం కై వసం చేసుకుంటే అమ్మవారి దర్శనానికి బీజేపీ కా ర్పొరేటర్లను తీసుకెళ్తానని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపా రు. మేయర్‌పీఠం కై వసం చేసుకోవడంతో కార్పొరేటర్లను హైదరాబాద్ చార్మినార్ వద్ద నున్న భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పరిచ య కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కరీంనగర్: ఆరోగ్యకేంద్రాలకు వచ్చే గర్భిణులకు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచించారు. మంగళవారం కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణుల కు వైద్య పరీక్షలతో పాటు అభా కార్డుల నమో దు సంఖ్యను పెంచాలన్నారు. 13ఏళ్ల వయస్సు పైబడినవారికి ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో స్క్రీనింగ్ చేయాలన్నారు. పీవో ఎంహెచ్‌ఎన్ సన జవేరియా, వైద్యాధికారి నవ్య, నర్సింగ్ ఆఫీసర్లు రాజు, శ్వేత, సాగర్ పాల్గొన్నారు.
కొత్తపల్లి (కరీంనగర్): రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు గరిష్ట స్థాయిలో మంజూరు చేసినట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ వి.గంగాధర్ తెలిపారు. కరీంనగర్ పరిధిలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 237 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు తెలిపారు. పంటల కోతకాలం ముగియడంతో, రైతుల అవసరాాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన అత్యధిక సంఖ్యలో సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో వేగం కొనసాగుతుందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కరీంనగర్‌కల్చరల్: జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో రజనీశ్రీ సాహిత్య పురస్కారం– 2026 గాను కథల సంపుటలను ఆహ్వానిస్తున్నట్లు పురస్కార కమిటీ కన్వీనర్ జీవీ.శ్యాంప్రసాద్ లాల్, సంస్థ అధ్యక్షుడు గాజు ల రవీందర్, ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివా స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారం కింద ప్రశంసాపత్రం,శాలువాతో పాటు రూ.10,116 నగదు బహుమతి అందిస్తామని పేర్కొన్నారు. రచయితలు సొంత కథల పుస్తకాలు పంపాలని, వివిధ రచయితలతో సంకలనం చేసి ముద్రించిన కథల పుస్తకాలు, అనువాద కథల పుస్తకాలు పోటీలకు స్వీకరించబడవన్నారు. జనవరి 2023 నుంచి 2025 డిసెంబర్ 31లోపు ముద్రించబడినవే పంపించాలని కోరారు. నాలుగు ప్రతులు గాజుల రవీందర్, ఇంటి నంబర్ 8–3–255/1, రామచంద్రాపూర్ కాలనీరోడ్ నంబర్ 12, భగత్‌నగర్,కరీంనగర్–505001 అడ్రస్‌కు 20మార్చి, 2026 లోగా పంపాలని సూచించారు. వివరాలకు 9848255525ను సంప్రదించాలని కోరారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బీజేపీ కార్పొరేటర్లు
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బీజేపీ కార్పొరేటర్లు


