పాతకక్షలతోనే కొమురయ్య హత్య | - | Sakshi
Sakshi News home page

పాతకక్షలతోనే కొమురయ్య హత్య

Feb 24 2026 7:31 AM | Updated on Feb 24 2026 7:31 AM

పాతకక్షలతోనే కొమురయ్య హత్య

పాతకక్షలతోనే కొమురయ్య హత్య

రామగిరి(మంథని): సెంటినరీకాలనీలో శనివారం బేగంపేటకు చెందిన మొలుగూరి కొమురయ్య పాతకక్షలతోనే హత్యకు గురైనట్లు గోదావరిఖని ఏ సీపీ రమేశ్‌ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో నిందితుడు బుర్ర కొమురయ్య ఉరఫ్‌ రాజకొమురయ్య అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు. ఆయన కథ నం ప్రకారం.. బుర్ర కొమురయ్య సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు. 2011లో అతడి కుమారుడు గుండారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ ప్రమాదానికి తనబావ మొలుగూరి సత్తయ్య, అతడి అన్న మొలుగూరి కొమురయ్య కారణమని భావిస్తూ వారిపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. అప్పటినుంచి వారిని హత్య చేయాలని పలుమార్లు యత్నించాడు. ఇద్దరూ ఒకేసారి కనిపించకపోవడంతో అవకాశం రాలేదు. ఈ విషయంపై గతంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఈనెల 21న సెంటినరీకాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్‌లో జరిగిన వివాహ వేడుకకు సత్తయ్య, కొమురయ్య తప్పకుండా వస్తారని అంచనా వేసిన నిందితుడు.. హత్యకు పథకం రచించాడు. ఇంటినుంచి తనబైక్‌పై కత్తి తీసుకుని, తన కుమార్తెను పెళ్లి మండపం వద్ద దింపి బయట వేచి ఉన్నాడు. మధ్యాహ్నం బాధితులు హాల్‌ నుంచి బయటకు వస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. ముందుగా సత్తయ్యపై కత్తితో దాడి చేయగా అడ్డుకోవడంతో చేతిపై గాయాలయ్యాయి. అనంతరం అతడి సోదరుడు కొమురయ్యపై ఎడమ చాతిలో బలంగా పొడిచాడు. దీంతో ఆయన తీవ్రగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని కల్వచర్ల పంచాయతీ పరిధిలోని మారుతినగర్‌ హనుమాన్‌ గుడి వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గోదావరిఖని టూ టౌన్‌ సీఐ ప్రసాద్‌రావు, ఎస్సైలు శ్రీనివాస్‌, రవికుమార్‌, సాగర్‌, సిబ్బంది రాజ్‌కుమార్‌, అశోక్‌ను ఏసీపీ అభినందించారు.

గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ వెల్లడి

నిందితుడి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement