ప్రతిభగల పోలీసు క్రీడాకారులకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభగల పోలీసు క్రీడాకారులకు ప్రోత్సాహం

Feb 24 2026 7:31 AM | Updated on Feb 24 2026 7:31 AM

ప్రతిభగల పోలీసు క్రీడాకారులకు ప్రోత్సాహం

ప్రతిభగల పోలీసు క్రీడాకారులకు ప్రోత్సాహం

గోదావరిఖని: క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా అన్నారు. 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026 సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్‌లను సీపీ సోమవారం అభినందించారు. క్రీడలకు సమయం కేటాయించే పోలీస్‌ అధికారులకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామన్నారు.

కాళేశ్వరం జోన్‌కు 23 పతకాలు..

కాళేశ్వరం జోన్‌ నుంచి 150 మంది పోలీసు క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 30మంది 23 పతకాలు సాధించారు. ఇందులో ఏడు బంగారు, 8వెండి, 8క్యాంస పతకాలు ఉన్నాయి. రామగుండం కమిషనరేట్‌కు చెందిన 15 మంది, ములుగు జిల్లా నుంచి ఐదుగురు, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి ఆరుగురు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి నలుగురు పతకాలు సాధించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్‌)శ్రీనివాస్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఏవో శ్రీనివాస్‌, సీఐలు కృష్ణ, ఆర్‌ఐలు శేఖర్‌, పెద్దన్న, సీసీ హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement