రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి టీఆర్‌నగర్‌కు చెందిన జెల్ల అనుదీప్ (35) ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడి మృతిచెందాడు. అనుదీప్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం జగిత్యాలకు వచ్చి స్కూటీపై ఆదివారం రాత్రి 11.40 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్తుండగా.. ధరూర్ శివారు జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనుదీప్ తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని మరో యువకుడు..
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన చందు(25) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. ఆదివారం రాత్రి చందు ద్విచక్రవాహనంపై గూడెం గ్రామానికి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గాయపడిన చందును సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు లలిత, ఎల్లం గుండెలవిసేలా రోదించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
కోరుట్ల రూరల్: పట్టణ శివారు జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఢీకొని నల్లూరి నరేష్ (24) మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం.. నరేష్ డెకరేషన్ పని చేస్తుంటాడు. సోమవారం వేకువజామున ఒంటి గంట సమయంలో ఫంక్షన్ హాల్‌లో డెకరేషన్ పని కోసం స్నేహితుని బైక్‌పై మెట్‌పల్లి వైపు వెళ్తున్నాడు. ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా.. నిర్లక్ష్యంగా లారీని నిలిపివేశారు. లారీని గుర్తించని నరేశ్ వెనుక నుంచి ఢీకొనటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిర్లక్ష్యంగా రోడ్డుపై లారీ నిలిపిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని నరేశ్ తల్లి యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
కోరుట్లరూరల్: ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మామిడి రాజ్‌కుమార్ (38) పట్టణ శివారు డీ–40 కాలువలో దూకి మృతి చెందినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ ఈనెల 21న తల్లిని మద్యం కోసం డబ్బులు అడిగాడు. తన వద్దని లేవని చెప్పటంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రెండురోజులుగా వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం మధ్యాహ్నం ఢీ–40 కెనాల్‌లో శవమై కనిపించాడు. భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


