ఆలయ అభివృద్ధిపై శ్రద్ధ
కొండగట్టు ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాం. మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు చేపడుతున్నాం. టీటీడీ నిధులతో రూ.35.19కోట్లతో 96గదుల సముదాయం, దీక్ష విరమణ మంటపం నిర్మిస్తున్నాం. వరదకాలువ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తాం. ఆంజనేయస్వామి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం.
– మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే
కొండగట్టుకు ఏటా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నారు. వారి సంఖ్యకు అనుగుణంగా భవిష్యత్ అవసరాల మేరకు వసతులు కల్పించాలి. భక్తుల కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. భక్తులకు వసతి గదుల నిర్మాణం ప్రధానంగా చేపట్టాలి.
– యాగండ్ల సుమన్, మల్యాల
ఆలయ అభివృద్ధిపై శ్రద్ధ


