
తాత బాటలో మనుమడు
వేములవాడరూరల్: కాలికి గజ్జె కట్టి ఒగ్గుకథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తాత మిద్దె రాములు వారసత్వాన్ని మనుమడు వినీత్ అందిపుచ్చుకున్నాడు. తాత బాటలోనే వెళ్తున్నా ఒగ్గుకథకు ఆధునికతను జోడించి మరింత ప్రచారం కల్పిస్తున్నాడు. వేములవాడరూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన మిద్దె రాములు ఒగ్గు కథను గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుత రోజుల్లో గ్రామీణ కళలు అంతరించిపోతున్న తరుణంలో ఆయన మనుమడు వినీత్ అదే ఒగ్గుకథ కార్యక్రమం నిర్వహిస్తూ తాత బాటలో వెళ్తున్నాడు. పదేళ్ల వయస్సులోనే మిద్దె రాములు కథ చెప్పేందుకు గ్రామాలకు వెళ్లే క్రమంతో మనుమడు వెంట వెళ్లి ఆసక్తి పెంచుకున్నాడు. పదేళ్ల వయసులోనే కాలుకు గజ్జె కట్టిన వినీత్ 17 ఏళ్లుగా 50 వరకు ప్రోగ్రాంలు ఇచ్చారు.
ప్రముఖుల ఎదుట ప్రదర్శన
మిద్దె రాములుతోపాటు కలిసి వెళ్తే క్రమంలో పదో ఏటనే వినీత్ డాక్టర్ సి.నారాయణరెడ్డి ఎదుట ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు పొందాడు. టీవీ, ప్రైవేటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కళా ప్రదర్శనలు చేశారు.
● గజ్జె కట్టి ఆడుతున్న మిద్దె వినీత్
● ఒగ్గుకథకు గుర్తింపు తెచ్చిన మిద్దె రాములు
● గుర్తింపును కొనసాగిస్తున్న మనుమడు