
మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఉద్యోగులు ఫైర్ అయ్యారు. సోమవారం ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జంగ్ సైరన్ పోస్టర్ ఆవిష్కరించారు. వచ్చేనెల ఒకటిన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 9న టీఎన్జీవోస్ కమ్యూనిటీ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగుల చైతన్య సదస్సు జరుగుతుందని తెలిపారు. ఆందోళనలకు ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. – కరీంనగర్ అర్బన్

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025