
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో సైతం ఓట్ల చోరీ జరిగిందన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలిచారన్న పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కరీంనగర్ ఓటర్లను మహేష్ గౌడ్ అవమానించారన్నారు.
ఈరోజు(మంగళవారం, ఆగస్టు 26వ తేదీ) కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. వార్డు మెంబర్‌గా కూడా మహేష్ గౌడ్ గెలవలేరని చురకలంటిచారు. అసలు మహేష్ గౌడ్‌ను కరీంనగర్ ప్రజలు గుర్తుపట్టరని, అటువంటి వ్యక్తి బీజేపీ ఓట్ల చోరీ చేసిందా? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఒకవేళఆ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ చేశారు. కరీంనగర్‌లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయంటూ బండి సంజయ్ ఆరోపించారు.
‘పీసీసీ అధ్యక్షుడు ఓట్ల గురించి కాదు సీట్ల చోరి గురించి సమాధానం చెప్పాలి. ఒక్కసారి వార్టు మెంబర్ కూడ గెలవని వారి మాటలకి నేను స్పందించను. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. ప్రభుత్వం రద్దు చేసి ఓట్లని సరిచేసి మళ్ళీ ఎలక్షన్ పోయే సత్తా ఉందా.?, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు రాళ్ళతో కొట్టే స్థితి కి దిగజారారు.
ప్రజలని కలవకుండా రాత్రి పూట పాదయాత్ర చేయడం ఏంటో?, కరీంనగర్ ప్రజలు పిసిసి అధ్యక్షుడుని గుర్తు పడతారా?, కరీంనగర్ లొని మైనారిటి దొంగ ఓట్లు ఉన్నాయని మేము ఫిర్యాదు చేసాం.. అయినా కూడ కరీంనగర్‌లో కాంగ్రెస్ లో గెలవలేదు. బిసి రిజర్వేషన్ల ఇయ్యమని అడిగితే ముస్లీం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఓట్ల చోరి జరిగి ఉంటే మిగితా ఎనిమిది సీట్లు మేమే గెలచేవారం. బండిసంజయ్‌ని తిడితే పెద్ద నాయకుడు అవుతాడని అనుకుంటున్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా బిజేపి దేశం కొసం, ధర్మం కొసం కొట్లాడుతుంది’ అని స్సష్టం చేశారు.
