
ఆధునిక వ్యాన్
ఆధునిక క్లూస్ పరికరాలు
ఆధారాల
సేకరణకు
జగిత్యాలజోన్/గోదావరిఖని: వివిధ నేరాలకు పా ల్పడుతున్న నిందితులు సాక్ష్యాలు దొరకకుండా పో లీసులకు సవాల్ విసురుతున్నారు. దీంతో కేసుల వి చారణలో భాగంగా సాక్ష్యాలు సంపాదించేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ మరింత సమర్థవంతమైన సాక్ష్యాల ను సేకరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్‌లను ఏర్పాటు చేసింది. ప్ర తీ జిల్లాకు ఒక వ్యాన్‌ను అందజేయగా, జగిత్యాలకు కేటాయించిన వ్యాన్‌ను ఇటీవల రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రారంభించగా, గోదావరి ఖనిలో సీపీ అంబర్‌కిషోర్ ఝా ప్రారంభించారు.
● సాక్ష్యాలు లేకుండా చేస్తుండడంతో..
కోర్టులో కేసు నిలబడాలంటే ఆ కేసులోని సాక్ష్యమే ప్రధాన ఆధారం. ఇందుకోసం పోలీసులు సంఘటన జరిగినప్పటి నుంచి కేసు విచారణలో భాగంగా పలు సాక్ష్యాలను సేకరిస్తుంటారు. విచారణ పూర్తయిన తర్వాత చార్జీషీట్ రూపంలో కోర్టుకు నివేదిక అందిస్తారు. అయితే, కొన్ని మర్డర్ కేసుల్లో మృతుల ఆనవాళ్లు సైతం లేకుండా కాలబెట్టడం, చోరీలు చేసినప్పుడు వేలిముద్రలు లేకుండా జాగ్రత్త పడటం..ఇలా హైటెక్ నేర ప్రవృత్తితో కేసు నుంచి తప్పించుకోవడానికి పలు రకాలుగా నిందితులు ప్రయత్నిస్తున్నారు. దీంతో, పోలీసులు ఘటన స్థలానికి వెళ్లినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు కనబడడంలేదు. ఒకవేళ నేర స్థలంలో ఏవైనా ఆనవాళ్లు దొరికితే వాటిని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు లేదా ఫింగర్‌ప్రింట్ ఆఫీసుకు పంపించడం, ఆ రిపోర్టులు వచ్చే వరకు విచారణ ఆగిపోవడంతో నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు.
● సమర్థవంతమైన సాక్ష్యాల కోసం..
నేరం జరిగిన ప్రాంతాల్లో వేగంగా సాక్ష్యాలు సేకరించేందుకు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్‌లు అందుబాటులోకి వచ్చాయి. చేతి వేలు, కాళ్ల ముద్రలు, శరీర భాగాలు, వెంట్రుకలు, గంజాయి, డ్రగ్స్ వంటి పదార్థాలు, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు, టైర్ ట్రాక్‌లు, షూ ప్రింట్లు, డిజిటల్ వస్తువులు..ఇలా ఏ ఆధారాలనైనా పోలీసులు అత్యాధునిక పద్ధతుల్లో సేకరించేందుకు వీలుపడుతుంది. గతేడాది అమలుల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా అన్ని జిల్లాలకు మొబైల్ వ్యాన్‌లను కేంద్రం అందించింది.
● వ్యాన్‌లో ఏముంటాయంటే..
మొబైల్ వ్యాన్ చూడడానికి ఒక మినీ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీలా కనబడుతుంది. ఇందులో ఉండే ఆధునాతన పరికరాల ద్వారా భారీ పేలుడు, హత్యలు, డ్రగ్స్ రవాణా, మహిళలపై అత్యాచారాలు, దాడులు.. ఇలా ఏ నేరం జరిగినా ఆధారాలను సత్వరమే సేకరించే అవకాశం ఉంటుంది. డిజిటల్‌గా ఉండే సాక్ష్యాలను సేకరించేందుకు కూడా అవసరమైన పరికరాలు ఉంటాయి. శిక్షణ పొందిన ఫోరెన్సిక్ ఆఫీసర్, ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, డ్రైవర్‌తో పాటు ఇతర సిబ్బంది వ్యాన్‌లో ఉంటారు. నేరం జరిగిన ప్రాంతాల్లో కొన్ని ఆధారాలు అసలే కనిపించవు. అలాంటి వాటిని గుర్తించే మోడ్రన్ లైట్ల వంటి పరికరాలు ఉంటాయి. సేకరించిన ఆధారాలను భ ద్రపరిచి, ల్యాబ్‌కు పంపించేవరకు ప్రిడ్జ్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే నేరం జరిగిన ప్రాంతానికి వ్యాన్ వెళ్లలేకపోయినప్పుడు, అవసరమైన సాక్ష్యాలను పరిశీలించేందుకు వాహనానికి ప్రత్యేకంగా అమర్చిన కెమెరా ఉంటుంది. కొన్ని కేసుల్లో, కొ న్ని రకాల ఆధారాలను అప్పటికప్పుడు పరిశీలించేందుకు అవసరమైన రసాయన పదార్థాలు ఉంటాయి.
● నేరం జరిగిన వెంటనే..
నేర తీవ్రతను బట్టి పోలీసులు మొబైల్ ఫోరెన్సిక్ బృందానికి సమాచారం అందించగానే 108 అంబులెన్స్ మాదిరిగా అక్కడకు చేరుకుంటాయి. ఘటన స్థలం యొక్క ఫొటోలు, వీడియో తీయడంతో పాటు ఆ స్థలం మ్యాప్ కూడా వేస్తుంది. అక్కడ పడిఉన్న ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, వాచ్‌లు వంటి డిజిటల్ పరికరాలను పరిశీలించేందుకు వ్యాన్‌లోని డిజిటల్ వ్యవస్థకు ఆధునాతన సాఫ్ట్‌వేర్‌ను క్రోడీకరిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను సైతం ఉపయోగించి వీలైనంత వేగంగా సాక్ష్యాలను సేకరిస్తారు. ఫొటో, వీడియోల ద్వారా వ్యక్తులను గుర్తించడానికి, అనుమానితులు ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేయడంలో ఉపయోగిస్తారు.
నేరం జరిగిన వెంటనే ఘటన స్థలానికి..
నేరం జరిగిన వెంటనే మొబైల్ వ్యాన్ ఘటన స్థలానికి చేరుకుంటుంది. వ్యాన్‌లో ఆధునిక క్లూస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో నిందితుల గుర్తింపు, సాక్ష్యాల సేకరణ సత్వరమే ప్రారంభమవుతుంది. మినీ ఫోరెన్సిక్ వ్యాన్ అందించే సాక్ష్యాలతో కేసులను మరింత వేగంగా విచారించే అవకాశం ఉంటుంది.
– అశోక్‌కుమార్, ఎస్పీ, జగిత్యాల

ఆధునిక వ్యాన్