
నేత్రదానం మహాదానం
కోల్‌సిటీ(రామగుండం): మరణించినా మరోఇద్దరికి లోకాన్ని చూసే అదృష్టం కల్పించడం నేత్రదానంతోనే సాధ్యం. చీకట్లో మగ్గుతున్నవారు అనేకమంది చూపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కంటిచూపుపై ఏటా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఎవరైనా దానం చేయొచ్చు
వయసుకు పరిమితి లేకుండా ఎవరైనా నేత్రాలు దానం చేయొచ్చు. కళ్లజోడు పెట్టుకునేవారు, బీపీ, షుగర్, ఉబ్బసం బాధితులు, కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నవారు సైతం నేత్రదానం చేయొచ్చు. హైపటైటీస్, ఎయిడ్స్ తదితర అంటు వ్యాధులున్నవారు నేత్రదానం చేయకూడదు.
96 గంటల్లో ట్రాన్స్‌ప్లాంటేసన్..
కార్నియాను 96 గంటల్లోగా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఐ బ్యాంకులు మానవ అవయవ మార్పిడి చట్టం పరిధిలోకి వస్తాయి. ఒకరుదానం చేసిన రెండు కార్నియాలతో కొన్నిసందర్భాల్లో నలుగురికి కంటిచూపు ప్రసాదించడానికి సాధ్యమవుతుంది. మిగతా సందర్భాల్లో ఇద్దరికి చూపు వచ్చేలా వైద్యనిపుణులు ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే, వ్యక్తి మరణించిన 6 గంటల్లోపే నేత్రాలను తీయాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
కార్నియా దానం చేయాలనుకుంటే మృతదేహం వద్ద ఫ్యాన్లు ఆఫ్ చేయాలి. ఎయిర్ కండిషనర్, కూలర్లు ఆన్ చేయాలి. తడిపిన దూది, ఐస్ ముక్కలను కళ్లపై ఉంచాలి. తలకింద తలగడ పెట్టి తలఎత్తుగా ఉండేలా చూడాలి. దీని ద్వారా టిష్యూ(కంటిపొర) తడిగా ఉంటుంది.
ఒకరిగా మరణించి.. ఇద్దరుగా జీవిద్దాం
నేటినుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు
గత పదేళ్లలో ఉమ్మడి జిల్లాలో నేత్రదానం చేసినవారు
నేత్రదాతలు 1,535
అవగాహన కార్యక్రమాలు 1,800
ప్రతిజ్ఞ చేసినవారు 65,000
అవగాహన కల్పిస్తున్న సంస్థలు
– ఫోన్‌నంబర్లు
సదాశయ ఫౌండేషన్
90102 01669, 94927 81306
లయన్స్ క్లబ్
73962 95999
తెలంగాణ నేత్ర, అవయవ,
శరీరదాతల సంఘం 99486 09591