
బావిలో పడి బాలుడి గల్లంతు
సైదాపూర్(హుస్నాబాద్): మండలంలోని రాయికల్‌లో ఆదివారం ఓ బాలుడు ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి గల్లంతయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాయికల్‌కు చెందిన చేరాల వెంకటయ్య–కావ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు కార్తీకనందన్(18 నెలలు) సంతానం. కావ్య తమ పొలంలో బిహార్ కూలీలతో వరి నాటు వేయించింది. నాటు పలుచగా వేశారని, మధ్యమధ్యలో నాటు వేద్దామని బాలున్ని తీసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అతడిని చెట్టుకింద కూర్చోబెట్టి పొలంలోకి దిగింది. ఈక్రమంలో కార్తీకనందన్ నడుచుకుంటూ బావి వైపు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. శబ్దం రాగానే తల్లి వచ్చి చూడగా బావిలో పడ్డట్టు నీటి కదలికలు కన్పించాయి. కావ్య అరుపులకు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. బావి నిండా నీళ్లు ఉన్నాయి. ఫైరింజన్ వచ్చినా బావి వరకు వెళ్లే పరిస్థితి లేదు. కరెంట్ మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. బావి నుంచి నీటిని పూర్తిగా తోడేస్తేనే బాలుడి ఆచూకీ దొరకనుంది.

బావిలో పడి బాలుడి గల్లంతు