
రోబోటిక్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి
సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోహం అకాడమీ ఆధ్వర్యంలో అందిస్తున్న రోబోటిక్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సప్తగిరికాలనీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్ ప్ర యోగాలను శనివారం పరిశీలించారు. జిల్లాలోని 15 ప్రభుత్వ పాఠశాలల్లో సోహం అకాడమీ రోబో టిక్స్ ఎడ్యుకేషన్‌ను ఉచితంగా అందిస్తున్నదన్నారు. నేర్చుకున్న అంశాల ద్వారా విద్యార్థులు సొంతంగా ప్రయోగాలు చేసేలా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సోహం అకాడమీ ఫౌండర్ సహదేవ్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా క్రీడా పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: జాతీయ క్రీడా వారోత్సవాలను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం స్థానిక సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. పాఠశాలలోని ప్రాథమిక, అంగన్‌వాడీ చిన్నారులకు పోటీలు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి రన్నింగ్ పోటీలను ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానం సాధించిన వారికి పతకాలు ప్రదానం చేశారు. డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, సీపీడీవో సబిత, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.