
ఆరోగ్య సేవలకు తాళం
సౌకర్యాలు కరువు.. వైద్యులు లేరు
చొప్పదండి: పట్టణంలోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయం పక్కన గల పీహెచ్‌సీలో వైద్య సేవలు గాడి తప్పా యి. ఆయుష్‌తో కలిసి నలుగురు డాక్టర్లను కేటా యించగా, డిప్యుటేషన్‌పైనే కొనసాగిస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్ చేసినా సేవలు విస్తరించక పోవడంతో పీహెచ్‌సీగానే కొనసాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా, డాక్టర్లు ముందే వెళ్లిపోతుండడంతో నర్సులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వైద్యులు కరీంనగర్ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో రాత్రిపూట అత్యవసర వైద్యసేవలకు ఇబ్బంది ఏర్పడుతోంది. మరుగుదొడ్డి ద్వారా నికి మరమ్మతు చేయక పోవడంతో తాడుతో డోరును బిగించడం గమనార్హం. పీహెచ్‌సీ ఆవరణలో గడ్డి తొలగించకపోవడంతో దోమలు ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి.