
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి)/ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి శనివారం ఎల్‌ఎండీకి 8,018 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్యాకేజీ–10 అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 9,600 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. మిడ్‌మానేరులోకి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి 21,368 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.936 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు గేట్లు ఎత్తడంతో ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, పొత్తూరు గ్రామ శివారు నుంచి మానేరువాగు ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది.
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ అటనామస్ కళాశాలలోని తెలుగు, కామర్స్, వృక్షశాస్త్ర విభాగాలను పరిశోధనా కేంద్రాలుగా గుర్తిస్తూ శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ తెలిపారు. కళాశాలలో శనివారం మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీ అధికారు ల బృందం ఈ మూడు విభాగాల్లోని ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, అధ్యాపకుల పరిశోధన పత్రాలు, రచించిన గ్రంథాలను తనిఖీ చేసి పరిశోధన కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, టి.రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారు సురేందర్‌రెడ్డి, పరి శోధన కమిటీ సమన్వయకర్త ఎం.మల్లారెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్‌క్రైం: హుస్నాబాద్‌లోని గాంధీనగర్‌లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 26వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.తిరుపతిరెడ్డి తెలిపారు. సీఎస్‌ఈ, ఈసీఈ, సీఎస్‌సీఏఐ కోర్సుల్లో ఎక్కడా అడ్మిషన్ తీసుకోని ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 11 గంటల వరకు కళాశాలలో ఇంటర్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీతో హాజరుకావాలని సూచించారు.

ఎల్‌ఎండీకి నీటి విడుదల