
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
కరీంనగర్‌క్రైం: పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. నగరంలోని మర్కజీ మిలాద్ కమిటీ, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ, మదరసా అన్వార్ ఉల్ ఉలూమ్ కమిటీ పెద్దలతో శనివారం సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పది రోజుల పాటు నిర్వహించే జల్సాలు, చివరి రోజు జరిగే జులూస్‌కు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.
13న జరిగే లోక్ అదాలత్ కోసం సమావేశం
సెప్టెంబర్ 13న నిర్వహించే లోక్ అదాలత్‌లో రాజీపడే కేసులను కోర్టులవారీగా పరిష్కరించాలని సీపీ గౌస్ ఆలం జిల్లా జడ్జి ఎస్.శివకుమార్‌ను కోరారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో కో ఆర్డినేషన్ మీటింగ్‌లో పాల్గొన్నారు. పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉండి, రాజీపడే కేసుల వివరాలను చర్చించారు. సైబర్ నేరాల్లో ఖాతాల్లో నిలిపివేయబడిన మొత్తాన్ని బాధితులకు రిఫండ్ చేసే అంశాన్ని లోక్ అదాలత్ సమయంలో మాత్రమే కాకుండా రెగ్యులర్‌గా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.