
కరెంట్ షాక్‌తో బీఆర్‌ఎస్ నేత మృతి
● మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ మాజీ సర్పంచ్ గందం వరలక్ష్మి భర్త, బీఆర్‌ఎస్ నాయకుడు గందం నారాయణ(53) శుక్రవారం కరెంట్ షాక్‌తో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నారాయణ ఉదయం 7 గంటలకు వరి పొలానికి నీళ్లు పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. స్టార్టర్ డబ్బా బయట ఉన్న తీగ ప్రమాదవాశాత్తు తగలడంతో షాక్‌కు గురై పోయాడు. ఆయన కుమారుడు అక్షయ్ వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
గ్రామస్తుల అనుమానాలు
నారాయణ మృతిపై గ్రామస్తులతో పాటు కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణ ప్రతీరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తారని, దీనిని అవకాశంగా తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు కరెంట్ మోటార్ స్టార్టర్ డబ్బాలోని తీగను బయటకు తీసుకవచ్చారని, బావివద్దకు వెళ్లేదారిలో దానినుంచి జే వైర్‌కు కనెక్షన్ ఇచ్చి వదిలేశారని అంటున్నారు. మోటార్ ఆన్ చేసేక్రమంలోనే జే వైరును చూడకుండా ప్రమాదవాశాత్తు తగిలి షాక్‌కు గురై మరణించినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పోక్సో కేసులో పదేళ్ల శిక్ష
గోదావరిఖని: పోక్సో కేసులో వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పెద్దపల్లి కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. ఓ ప్రభుత్వ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న షేక్ సర్వర్.. 2019లో తరగతి గదిలోకి వెళ్లి తలుపులు మూసివేశాడు. బాలికపై ను అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక తప్పించుకునేందుకు యత్నించగా.. కొట్టి ఎవరికీ చెప్పవద్దని బెదిరించి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. ఈమేరకు అప్పటి వన్‌టౌన్ సీఐ రమేశ్ కేసు నమోదు చేయగా, ఏసీపీ ఉమేందర్ దర్యాప్తు చేశారు. జిల్లా జడ్జి ఇరుపక్షాల వాదనలు విన్నారు. నేరం రుజువుకావడంతో షేక్ సర్వర్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.సునీత తీర్పునిచ్చారు. నేరస్తుడికి శిక్ష పడడంలో ముఖ్యపాత్ర పోషించిన పీపీ రమేశ్, సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, కోర్టు కానిస్టేబుళ్లు సతీశ్‌కుమార్, కోటేశ్వర్‌రావును రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ కరుణాకర్ అభినందించారు.