
సిటీలో పోలీసుల కవాతు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సిటీలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ కవాతు బస్టాండ్, వన్‌టౌన్, కమాన్, రూరల్ పోలీస్ స్టేషన్, శాస్త్రిరోడ్డు, టవర్‌సర్కిల్, రాజీవ్‌చౌక్, గాంధీరోడ్డు, మంచిర్యాలచౌరస్తా, కోర్ట్ చౌరస్తా, తెలంగాణ చౌక్ మీదుగా తిరిగి పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించడం పోలీసుల కర్తవ్యమన్నారు. ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, జాన్‌రెడ్డి పాల్గొన్నారు.