జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు ఇద్దరు రైతులు 14 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తెచ్చారు. క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.7,600, కనిష్ట ధర రూ.6,500కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్‌కు శనివారం, ఆదివారం సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్– 2 కార్యదర్శి రాజా తెలిపారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ సబ్‌స్టేషన్లలో నెలావారీ నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 33/11 కె.వీ.మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ సబ్‌స్టేషన్ల పరిధిలోని మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, నల్లకుంటపల్లి, చెర్లభూత్కూర్, తాహెర్‌కొండాపూర్, దుబ్బపల్లి, ఫకీర్‌పేట, చామన్‌పల్లి, జూబ్లీనగర్, బహద్దూర్‌ఖాన్‌పేట, ఎలబోతారంలో విద్యుత్ నిలిపివేయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33/11 కె.వీ.బొమ్మకల్ సబ్‌స్టేషన్ పరిధి లోని శ్రీపురం కాలనీ, రజ్వీచమన్, సిటిజన్‌కా లనీ, విజయనగర్‌కాలనీ, ప్రియదర్శిని కాలనీ, బైపాస్‌రోడ్, బొమ్మకల్, లక్ష్మీనగర్, చల్మెడ ఆసుపత్రి, గుంటూర్‌పల్లి, దుర్శేడ్, గోపాల్‌పూ ర్ గ్రామాల్లో సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు 33/11 కె.వీ.ఖాజీపూర్ సబ్‌స్టేషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వర కు ఆసిఫ్‌నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
పాదయాత్ర విజయవంతం చేయాలి
కరీంనగర్‌కార్పొరేషన్: ఈ నెల 24వ తేదీన గంగాధరలో జరిగే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ప్రజా కార్యాలయంలో వెలి చాల, సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్ నుంచి, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. నాయకులు మల్లికార్జున రాజేందర్, అర్ష మల్లేశం, ఆకుల నర్సయ్య, వైద్యుల అంజన్‌కుమార్, మాచర్ల ప్రసాద్, గంట శ్రీనివాస, కోటగిరి భూమాగౌడ్, కర్ర రాజశేఖర్, పత్తెం మోహన్, ఎండీ తాజ్, సమద్‌నవాబ్, చర్ల పద్మ పాల్గొన్నారు.
‘తెలుగు తేజం’ పురస్కారాలకు ఎంపిక
కరీంనగర్ కల్చరల్: తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన సాహితీవేత్తలకు శ్రీశ్రీ కళావేదిక ప్రతి ఏటా అందజేసే ‘తెలుగు తేజం’ పురస్కారానికి ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ, రచయిత్రి చిందం సునీత ఎంపికయ్యారు. ఈ నెల 31న గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగే తెలుగు భాషా దినో త్సవ వేడుకల్లో పురస్కారం అందుకోనున్నా రు. సాహితీవేత్తలు లక్ష్మణ్ రావు, అనిల్, ప్ర మోద్‌కుమార్, చంద్రశేఖర్ అభినందించారు.
రేపు జిల్లాస్థాయి పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈనెల 24న స్థానిక అంబేద్కర్ స్టేడియంలో సబ్ జూనియర్, జూనియర్ యోగా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ యూనిట్ కన్వీనర్ ముత్యాల రమేశ్ తెలిపారు. జిల్లాస్థాయిలో రాణించినవారిని సెప్టెంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9గంటల వరకు ఆధార్‌కార్డుతో రిపోర్టు చేయాలని, పూర్తి వివరాలకు 85229 20561, 94400 65556 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
పత్తి మార్కెట్‌కు రెండ్రోజులు సెలవు