
విద్య, ఆరోగ్యంపై దృష్టి
శుక్రవారం సభను ఉపయోగించుకోవాలి
ఎరువుల విక్రయాలను ఆన్‌లైన్ చేయాలి
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. దుర్శేడ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు, పోషణలోపం పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ చిన్నారులతో ముచ్చటించి, భోజనం వడ్డించారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. 5వ తరగతి విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠం చదివించారు. దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘంలో ఎరువుల విక్రయాలను తనిఖీ చేశారు. సంఘం ఆవరణలో మొక్క నాటారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, సీడీపీవో సబిత, సొసైటీ చైర్మన్ తోట తిరుపతి పాల్గొన్నారు.