
విరిగిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రహీంఖాన్‌పేట మీదుగా ఇల్లంతకుంటకు వస్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్, వీల్ జాయింట్ రాడ్ విరిగిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల నుంచి వెల్జీపురం మీదుగా ఇల్లంతకుంటకు గురువారం సాయంత్రం ఐదు గంటలకు వస్తున్న ఆర్టీసీ బస్సు రహీంఖాన్‌పేట సమీపంలో స్టీరింగ్, వీల్‌టైర్లకు కలిసి ఉండే జాయింట్ రాడ్ ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును అక్కడికక్కడే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు.