
మోడల్ స్కూల్ విద్యార్థులకు గాయాలు
మానకొండూర్: మండలంలోని పోచంపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు...చెంజర్ల గ్రామానికి చెందిన గాజుల అభిషేక్ ఎనిమిదో తరగతి, ఇదే గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి యశ్వక్ చేతన్ యథావిధిగా గురువారం ఉదయం మోడల్ స్కూల్‌కు ప్రత్యేక బస్సులో వెళ్లారు. సాయంత్రం మోడల్ స్కూల్ వద్ద బస్సు ఎక్కేక్రమంలో ఫుట్‌బోర్డు నుంచి జారి కిందపడిపోయారు. అభిషేకు తీవ్ర, యశ్వక్‌చేతన్‌కు స్వల్ప గాయాలయ్యాయని ఆ సమయంలో బస్సు రన్నింగులో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని తెలిపారు.