
బెడ్లు సరిపోక.. నవారు మంచాలపై చికిత్స
వాతావరణ మార్పులతో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. చిన్నారులు జబ్బుపడి చికిత్స కోసం ఆసుపత్రి బాట పడుతున్నారు. అడ్మిట్ అయినవారు జ్వరం తగ్గకపోవడంతో.. ఆస్పత్రుల్లోనే ఉంటుండగా.. కొత్తగా వచ్చే రోగులకు బెడ్లు సరిపోని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో పిల్లల వార్డులో బెడ్లు సరిపోక నవారు మంచాలు వేసి చికిత్స అందిస్తున్నారు. పిల్లలు మంచాల్లో చికిత్స పొందుతూ కిక్కిరిసిన పిల్లల వార్డు ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

బెడ్లు సరిపోక.. నవారు మంచాలపై చికిత్స