
ఊరు పేర్లతో రైళ్లు
రామగుండం: సికింద్రాబాద్, విజయవాడ–బల్హర్షా రూట్‌లో పలు రైళ్లు ఊర్ల పేర్లతో నడుస్తుండడంతో పలువురు ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. రైల్వేయాప్, రైల్వేస్టేషన్లలో అనౌన్స్‌మెంట్‌లోనూ ఊరు పేర్లతోనే చెబుతుండడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్– కాగజ్‌నగర్ మధ్య నడిచే రైలు నంబరు 12758(కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్), సికింద్రాబాద్– రాయ్‌పూర్ మధ్య నడిచే రైలు నంబరు 12772 (సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్), కాజీపేట– బల్హర్షా మధ్య నడిచే రైలు నంబరు 17036 (బల్హర్షా/కాజీపేట ఎక్స్‌ప్రెస్), యశ్వంతపూర్– గోరఖ్‌పూర్ మధ్య నడిచే రైలు నంబరు 12591 (యశ్వంత్‌పూర్/గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్), సికింద్రాబాద్– దాణాపూర్ మధ్య నడిచే రైలు నంబరు 12791 (దాణాపూర్ ఎక్స్‌ప్రెస్) ఇలా చాలా రైళ్లు వెళ్లే క్రమంలో ఓ ఊరు పేరుతో, తిరుగు ప్రయాణంలో స్టేషన్ పేరుతో రాకపోకలు సాగిస్తున్నాయి.
ప్రయాణికులు తికమక
సికింద్రాబాద్– కాగజ్‌నగర్ మధ్య మూడు రైళ్లు నడుస్తున్నాయి. ఒక రైలుకు భాగ్యనగర్‌గా పేరుంది. మిగతావి ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్నారు. కాగజ్‌నగర్– సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబరు (17011/17012) ఎగువ ప్రయాణ సమయంలో ఇంటర్‌సిటీగా, తిరుగు ప్రయాణంలో బీదర్ ఎక్స్‌ప్రెస్‌గా రైల్వే యాప్‌లో ఉండడంతో పాటు రైల్వే అనౌ న్స్‌మెంట్ సైతం ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తోంది. బీదర్ రూట్‌కు స్థానికంగా ఎలాంటి సంబంధమూ లేదు. సికింద్రాబాద్– హిస్సార్ మధ్య నడిచే రైలుకు మంజీర ఎక్స్‌ప్రెస్‌గా, కరీంనగర్– సిర్పూర్ మధ్య నడిచే పుష్‌పుల్‌కు శ్రీరాజరాజేశ్వరస్వామి, దానా పూర్ ఎక్స్‌ప్రెస్‌కు మణికర్ణిక పేర్లను ప్రతిపాదించినా అధికారికంగా అమలు చేయడం లేదు.
తికమకపడుతున్న ప్రయాణికులు
నంబర్‌తోనే సదరు రైలుగా గుర్తింపు
ఏళ్లుగా పలు రైళ్లకు పేరు లేని వైనం