
స్థానిక సంస్థల్లో యువతకే ప్రాధాన్యం
సిరిసిల్లఅర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామనిచ్చే అవకాశం ఉందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రగుడు మల్లీకార్జున ఫంక్షన్‌హాల్‌లో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితంగానే అధికారంలోకి వచ్చామన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. రాబోయే కాలానికి కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీ అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం లేదన్నారు. యూరియాపై కేటీఆర్ కేంద్రాన్ని నిలదీయాలన్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యానారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, నాయకులు పకృద్దీన్, సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి శ్రీనివాస్, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, చక్రధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్