
కేటీఆర్ భాష థర్డ్‌క్లాస్‌కు చేరింది
న్యాయ కోవిదుడు సుదర్శన్‌రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థి
ఉపరాష్ట్రపతి విషయంలో బీఆర్‌ఎస్ వైఖరి 9న తేలిపోనుంది
మంత్రి పొన్నం ప్రభాకర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భాష థర్డ్‌క్లాస్‌కి మారిపోయిందని, ఆపార్టీ బీజేపీ వైపు ఉంటుందా? లేదా ? అన్నది 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తేలపోనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌లతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజలకు మరింత భరోసా కల్పించేందుకు మీనాక్షి నటజరాన్ జనహితయాత్ర చేపట్టారన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత విషయంలో బీఆర్‌ఎస్ రైతుల్లో గందరగోళం సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో కేటీఆర్ భాష థర్డ్ క్లాస్‌కు మారిపోయిందన్నారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చి హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జిగా చేసిన సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు. ఈ విషయంలో గోడ మీద పిల్లిలా ఉన్న బీఆర్‌ఎస్ వైఖరి 9న తేలనుందన్నారు. కేటీఆర్ ఎవరు యూరియా ఇస్తే.. వారికి ఓటేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నియోజకవర్గంలో ఎరవుల కొరతపై చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 24వ తేదీన జిల్లాలో జరిగే మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. గంగాధర మండలం ఉప్పరమల్యాల నుంచి మధురానగర్‌వరకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లు పాదయాత్ర చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీశ్రేణులు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 24వ తేదీన గంగాధరలోనే బస చేసి, 25న ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం, మొక్కలు నాటుతారన్నారు. నాయకులు వెలిచాల రాజేందర్‌రావు, వైద్యుల అంజన్‌కుమార్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఆకుల ప్రకాశ్, వీరదేవెందర్, పులి ఆంజనేయులు, శ్రవణ్‌నాయక్ పాల్గొన్నారు.