
హెచ్‌ఐవీ నిర్మూలనకు కృషి చేయాలి
కరీంనగర్‌టౌన్: జిల్లాలో హెచ్‌ఐవీ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మీటింగ్ హాల్లో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశానుసారం అంగన్వాడీ టీచర్లకు హెచ్‌ఐవీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలందరూ హెచ్‌ఐవీపై పూర్తి విధివిధానాలు తెలుసుకొని నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. క్రార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) సుధా, డాక్టర్ సన జవేరియా, డెమో రాజగోపాల్, సఖి కన్సల్టెంట్ లక్ష్మి, డాప్కో టీం జిల్లా సభ్యులు, అడ్వకేట్ హేమంతాపటేల్, సఖి లీగల్ కౌన్సిలర్ సంధ్యారాణి, డీపీహెచ్‌ఎన్‌వో విమల పాల్గొన్నారు.