
వేగంగా డబ్బులు జమచేస్తున్నాం
జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా నిర్మాణాల దశలను పరిశీలించి డబ్బులు ఖాతాల్లో జమ చేయిస్తున్నాం. తాపీ, ఇసుక, ఇటుక, ఇంటి సామగ్రి యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ధరలను అదుపులో ఉంచాం. 45 రోజుల్లో ఇళ్లు పూర్తయ్యే అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– రాజేశ్వర్, హౌసింగ్ పీడీ, పెద్దపల్లి
ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్టు కింద మా గ్రామాన్ని ఎంపిక చేశారు. ముగ్గు పోసి నిర్మాణం ప్రారంభించగా, దశల వారీగా డబ్బు ఖాతాలో జమచేశారు. దీంతో ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే నా బ్యాంక్ ఖాతాలో రూ.4లక్షలు జమయ్యాయి. సొంతింటి కల నెరవేరింది.
– కనుకుంట రమే్‌శ , సోమన్‌పల్లి

వేగంగా డబ్బులు జమచేస్తున్నాం