
కలెక్టరేట్, ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండాలి
కరీంనగర్ కార్పొరేషన్: కలెక్టరేట్, సివిల్ హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియం, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డితో కలిసి హాస్పిటల్‌ను, పరిసరాలను తనిఖీ చేశారు. బొమ్మకల్‌లోని మిషన్ భగీరథ వాటర్‌ట్యాంక్‌ను పరిశీలించారు. సిటిజన్స్‌కాలనీ తాగునీటి సమస్యపై చర్చించారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో శానిటేషన్ వాహనాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్, హాస్పిటళ్లలో పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఎక్కడా చెత్త కనిపించొద్దని చెప్పారు. నూతనంగా కొనుగోలు చేస్తున్న శానిటేషన్ వాహనాలకు షెడ్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. హౌసింగ్‌బోర్డుకాలనీలోని మినీస్టేడియం స్థలంలో షెడ్డునిర్మాణానికి పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ వద్ద స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులు ఆకుల ప్రకాశ్, తోట రాజేందర్ విజ్ఞప్తి చేశారు. డీఈ లచ్చిరెడ్డి, దేవేందర్, వెంకటేశ్వర్లు, ఏసీపీ వేణు, ఏఈ సతీశ్ పాల్గొన్నారు.