ప్రజారోగ్యంతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంతో చెలగాటం

Aug 21 2025 6:58 AM | Updated on Aug 21 2025 6:58 AM

ప్రజా

ప్రజారోగ్యంతో చెలగాటం

పర్యవేక్షణ కరువు

కోల్‌సిటీ(రామగుండం): వ్యాధి నిర్ధారణ, చికిత్సలో వినియోగించిన దూది, సూది, సిరంజీ, సర్జికల్‌ బ్లేడ్‌, రక్తంతో తడిసిన కాటన్‌, వాడిన యూరిన్‌ బ్యాగ్‌.. బ్లడ్‌ బ్యాగ్‌.. ఇలా అనేక జీవ వైద్యవ్యర్థాలు(బయో మెడికల్‌ వేస్ట్‌)ను చెత్తలో కలిపేస్తున్నారు. బయో మెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ సక్రమంగా లేక ప్రజారోగ్యానికి పెనుప్రమాదం పొంచిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులతోపాటు ల్యాబ్‌ల నుంచి వెలువడే బయో మెడికల్‌ వేస్ట్‌ వ్యర్థ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు చేరుతుందా? లేదా? అనేదానిపై పర్యవేక్షణ లేక ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు.

సాధారణ చెత్తలో.. బయో మెడికల్‌ వేస్ట్‌..

బయో మెడికల్‌ వేస్ట్‌ను సేకరించడానికి కరీంనగర్‌లోని వెంకటరమణ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వాహనాలు ఉంటాయి. ఆస్పత్రుల నిర్వాహకులు జీవవైద్య వ్యర్థాలను రోజూ వచ్చే ఆ వాహనాలకు ఇవ్వాలి. కానీ కొందరు చెత్తలోనే కలిపేస్తున్నారు.

డబ్బాల వినియోగంపైనా నిర్లక్ష్యం..

ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను వాటి తీరునుబట్టి పసుపు, ఎరుపు, నీలం, నలుపు తదితర రంగు డబ్బాల్లో వేయాలి. కానీ, వీటిపై సిబ్బందికి కూడా అవగాహన లేదని తెలుస్తోంది. 48 గంటలకు మించి వ్యర్థాలను ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదని, శాసీ్త్రయ పద్ధతిలో రీసైక్లింగ్‌ చేయాల్సి ఉంటుందని నిబంధనలు ఉన్నాయి. వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

భారీ జరిమానా వసూలు..

రామగుండం నగరంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు, బయో మెడికల్‌ వేస్ట్‌ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరమైన బయో మెడికల్‌ వేస్ట్‌ను బయట పడవేసిన శ్రీఅదితి హాస్పిటల్‌కు రూ.లక్ష, సత్యం హాస్పిటల్‌కు రూ.50వేలు, వెంకటసాయి క్లినికల్‌ ల్యాబ్‌కు రూ.10వేలు చొప్పున ఈనెల 14న బల్దియా అధికారులు జరిమానా విధించారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌ల నుంచి వెలువడే బయో మెడికల్‌ వేస్ట్‌ను కరీంనగర్‌లోని వెంకటరమణ ప్లాంట్‌కు పంపిస్తున్నారా? లేదా? అనేదానిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు వ్యర్థాలను ఇవ్వడానికి జిల్లాలోని 141 ప్రైవేట్‌ ఆస్పత్రులు(హెల్త్‌ కేర్‌ ఫెసిలిటీ–హెచ్‌సీఎఫ్‌)కు అనుమతి పొందితే, మిగిలిన 46 ఆస్పత్రులు అనుమతి తీసుకోలేదు. ప్రభుత్వ ఆస్పత్రులు 68 ఉండగా, ఇందులో గోదావరిఖని జనరల్‌ గవర్నమెంట్‌ ఆస్పత్రి, పెద్దపల్లి సివిల్‌ ఆస్పత్రి మినహా మిగిలిన 21 పీహెచ్‌సీలకూ అనుమతుల్లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

ప్రైవేట్‌ ఆస్పత్రుల ఇష్టారాజ్యం

రోడ్లపై పడేస్తున్న బయో మెడికల్‌ వేస్ట్‌

వ్యర్థాలతో వ్యాధులు సోకే ప్రమాదం

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

ప్రజారోగ్యంతో చెలగాటం 1
1/1

ప్రజారోగ్యంతో చెలగాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement