
శాతవాహన అధ్యాపకుడికి అవార్డు
కరీంనగర్‌క్రైం: రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 2022– 23 ఏడాదికిగానూ ఉత్తమ అధ్యాపకులను సత్కరించారు. శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యుడు డాక్టర్ నజీముద్దీన్ మునవర్ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఎస్‌యూ రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేశ్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత, ఉర్దూ విభాగాధిపతి అబ్రారూల్ బాకీ, జాఫర్, హుమేరా తస్లీమ్ శ్రీవాణి అభినందించారు.