
జరిమానా విధిస్తాం
ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్‌ను బహిరంగ ప్రదేశాలు, చెత్త కుండీల్లో వేసే ఆస్పత్రుల నిర్వాహకులకు జరిమానా విధిస్తాం. హానికర బయో మెడికల్ వేస్ట్‌ను నగరపాలక సంస్థ డంపింగ్ యార్డుకు తరలించదు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏజెన్సీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనానికి వ్యర్థాలను అందించి ఆస్పత్రుల నిర్వాహకులు సహకరించాలి.
– అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా
బయో మెడికల్ వేస్ట్‌ను చెత్తలో వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇటీవల రామగుండం నగరపాలక అధికారులు పలు ఆస్పత్రులకు ఈవిషయంలో జరిమానా విధించారని తెలిసింది. వాటికి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌తో అనుసంధానం ఉందో? లేదో? తెలుసుకుంటాం. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.
– భిక్షపతి, ఈఈ,, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి

జరిమానా విధిస్తాం