
ఎంసీ శేఖర్‌కు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులు
సిరిసిల్ల: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి రెండు అంతర్జాతీయ అవార్డులను రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎంసీ శేఖర్ (మేర్గు చంద్రశేఖర్) సాధించాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ లా ఆర్ట్ అఫ్ ఫొటోగ్రఫీ (ఎఫ్‌ఐఏపీ) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీ(ఎఫ్‌ఐపీ)సంస్థలతో కలిపి ఇండోర్ కు చెందిన ‘మాల్వా ఫొటోగ్రఫీ’ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫొటోగ్రఫీ పోటీల్లో ఎంసీ శేఖర్ హైదరాబాద్ గోల్కొండ కోటలో తీసిన ‘ఫోర్ట్ గేట్’ ఫొటోకు బంగారు పతకం వరించింది. ఇదే పోటీలో తెలంగాణకు చెందిన మథుర లంబాడాల జీవనశైలిపై తీసిన ‘చిట్ చాట్’ చిత్రానికి ఫ్రాన్స్‌కు చెందిన ‘ఫియాప్’ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ లా ఆర్ట్ ఫొటోగ్రఫీ, ఫ్రాన్స్) సంస్థ ‘హనరెబుల్ మెన్షన్’ అవార్డు ప్రకటించింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు, పలు దేశాల గౌరవ పురస్కారాలు పొందిన శేఖర్ మూడున్నర దశాబ్దాలుగా సిగ్నా ఫొటో గ్రఫీ సంస్థ ద్వారా రాణిస్తున్నారు. తాజా మరో రెండు అవార్డులు సాధించిన చంద్రశేఖర్‌ను పలువురు అభినందించారు.

ఎంసీ శేఖర్‌కు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులు

ఎంసీ శేఖర్‌కు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులు