
అమ్మవారికి చేనేత కళాకారుడి ప్రత్యేక చీర
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి మంగళవారం ఈవో రాధాబాయికి సమర్పించారు. ఈ సందర్భంగా విజయ్‌ని ఈవో సత్కరించారు. అలాగే దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా ఆలయంలో ఈవో ప్రత్యేక పూజలు చేశారు.
నేడు హుండీ లెక్కింపు
వేములవాడ రాజన్న హుండీలలోని కట్నాలు, కానుకలను బుధవారం ఉదయం 8 గంటల నుంచి స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో లెక్కించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పేర్కొన్నారు. ఆలయ ఉద్యోగులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని మార్కెట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి(50) వర్షంలో తడుస్తూ వణుకుతుండగా, వన్‌టౌన్ పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 10.30 గంటలకు మృతి చెందాడు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని సీఐ రామచంద్రరావు తెలిపారు.

అమ్మవారికి చేనేత కళాకారుడి ప్రత్యేక చీర