కరీంనగర్‌టౌన్/కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం వైద్యారోగ్యశాఖ అధికారులతో గత నవంబర్ నుంచి పీహెచ్‌సీల్లో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు. గంగాధర పీహెచ్‌సీలో 28 ప్రసవాలు కావడంపై అభినందించారు. ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలు మొదటి స్క్రీనింగ్ 100 శా తం పూర్తి చేస్తూనే రెండోస్క్రీనింగ్ ప్రారంభించాల ని ఆదేశించారు. టీబీ పరీక్షలు పెంచాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీ సర్ సనా, ఇమ్యునైజేషన్ అధికారి సాజిత ఉన్నారు.
‘బుధవారం బోధన’కు ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ఆంగ్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై సమీక్షించారు. పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇంగ్లిష్‌లో రాణించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్పెల్‌బీ, హ్యాండ్ రైటింగ్, బుక్‌రివ్యూ, సందేశాత్మక సినిమా రివ్యూ రాయించడం వంటివి అమలు చేయాలని తెలిపారు. పాఠశాలల్లో లిటరల్లీ ల్యాంటన్ లాంగ్వేజ్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. డీఈవో చైతన్య జైనీ, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. చింతకుంటలోని శాంతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. తరగతి గదులు తిరుగుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్నం భోజ నం, బోధన మెటీరియల్, రీడింగ్ కార్నర్‌ను పరిశీ లించారు. అదనపు తరగతి గదుల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎంఈవో ఆనందం, హెచ్‌ఎం గౌస్‌ఖాన్ పాల్గొన్నారు.