
యూరియాను పక్కదారి పట్టిస్తేకఠిన చర్యలు
కరీంనగర్ అర్బన్: యూరియా బస్తాకు నిర్ణీత ధరకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని, యూరియా ఇతర బస్తాలు లింకు పెట్టి విక్రయిస్తే ఉపేక్షించమని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని, కావాలనే పుకార్లు లేపుతున్నారని రైతులు నమ్మవద్దని సూచించారు. యూరియా పక్కదారి పట్టిస్తే సహించబోమ ని, ఎంతటివారైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జిల్లాలో యూరియా సమస్య, అధిక ధరలకు విక్రయాలు, లింకు విక్రయాలపై మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీస్‌శాఖలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని, యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు.
రైతుల సమస్యలు, ఫిర్యాదులకు
టోల్ ఫ్రీ నంబర్
89777 41771