మత్తుగా ప్రాణం తీస్తోంది!
గంజాయితో నష్టాలు
● గంజాయి మానవ శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
● తరచూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.
● పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తుంటారు. తెలియని ఆతృత, భయం కలిగి ఉంటారు. ఇంద్రియాలు ఆధీనంలో ఉండవు.
● అతిగా తీసుకోవడంతో కళ్లు ఎర్రగా కనిపిస్తాయి. దృష్టి లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది.
● హృదయ స్పందన రేటు, రక్త పోటు పెరుగుతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.
● ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
● గంజాయితో జీవితాలు చిత్తు ● ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుగా దిగుమతి
● గ్రానైట్ కార్మికుల్లో చాలా మంది సేవనం
● పట్టుబడి జైలుకు వెళ్లిన వారిలో కార్మికులు, యువకులే ఎక్కువ
‘నేను గంజాయిని.. మీ చుట్టూ తిరుగుతున్న మహమ్మారిని.. ఒకప్పుడు మహానగరాలు.. పట్టణ ప్రాంతాల్లోనే నా ఉనికి ఉండేది. ఇప్పుడు అన్నిగ్రామాలు చుట్టివస్తున్నాను. పిల్లలు, యువకులే కాదు.. అమ్మాయిలూ నాకు దాసోహం అవుతున్నారు. ‘మత్తు’లో ముంచి.. విలువైన జీవితాలను చిత్తు చేస్తున్నాను. నా ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా? మిమ్మల్ని మైకంలో ముంచి.. విచక్షణ కోల్పోయేలా చేస్తాను. నాకు యాష్ ఆయిల్, చాక్లెట్ల రూపాన్ని తీసుకొచ్చారు. భిన్నరూపాలు, మార్గాలు ఉండటంతో పోలీసులూ ఏం చేయలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మీ వద్దకు వస్తున్నా. మరి నన్ను ఆదరిస్తారా? తరమికొడతారా ? ఆలోచించుకోండి’.
కరీంనగర్‌క్రైం: ఇతర రాష్ట్రాల నుంచి కరీంనగర్‌కు గంజాయి దిగుమతి అవుతోంది. బిహార్, ఛత్తీస్‌గఢ్, భద్రాద్రి కొత్తగూడెం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, అరకు, భీమునిపట్నం వద్ద గల ఎజెన్సీ ఏరియాల నుంచి కరీంనగర్‌కు గంజాయి రవాణా చేస్తున్న యువకులు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. గంజాయి సేవించడంతో పాటు జల్సాల ఖర్చుల కోసం దానిని వ్యాపారంగా మార్చుకొని చాలా మంది యువకులకు అలవాటు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రానైట్, క్రషర్లు, ఇతర ఫ్యాక్టరీల్లో పని చేసే గంజాయి అలవాటు ఉన్న కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లినప్పుడు దానిని వెంట తెచ్చుకోవడంతో దందా మొదలవుతుంది.
ధర తక్కువ.. మత్తు ఎక్కువ
కరీంనగర్‌లోని కొత్తపల్లి మండలం బావుపేట, ఎలగందల్ ప్రాంతాల్లో సుమారు 300 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 10 వేల వరకు బిహార్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు పనిచేస్తుంటారు. వీరంతా బావుపేట, ఎలగందల్‌తో పాటు కొత్తపల్లి మండలంలోనే ఎక్కువగా ఉంటారు. మద్యం తాగాలంటే రోజుకు కనీసం రూ.200 నుంచి రూ.500 వరకు కావాల్సి ఉంటుంది. కానీ, గంజాయి అయితే రోజుకు రూ.100 లోపే ఉండడంతో డబ్బులు మిగులుతాయని దీనికి అలవాటుపడుతున్నారు. కాగా, అమావాస్య రోజు గ్రానైట్ కార్మికులకు సెలవు కావడంతో ఆ రోజంతా గంజాయి సేవనం విచ్చలవిడిగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం.
కూలీ పనికి వచ్చి గంజాయి దందా
ఇతర రాష్ట్రాల నుంచి కరీంనగర్‌లోని గ్రానైట్, క్రషర్, ఇటుకబట్టీలకు వేల సంఖ్యలో కార్మికులు వస్తుంటారు. బిహార్ నుంచి కూలీ పని కోసం వచ్చిన ఓ వ్యక్తి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత గంజాయి సరఫరా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి అక్కడి నుంచి కరీంనగర్‌కు గంజాయి దిగుమతి చేయసాగాడు. ఇటీవల అతడిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి కేసుల్లో పట్టుబడినవారిలో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. గంజాయి దిగుమతి చేసుకుంటున్న కూలీలు ఇతర కూలీలను టార్గెట్ చేసుకొని సిగిరెట్ల రూపంలో రూ.100 నుంచి రూ.200 వరకు అమ్మకాలు చేస్తున్నారు. గంజాయి నియంత్రణకు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు చర్యలు చేపడుతున్నా దందాకు అడ్డుకట్ట పడడం లేదు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రహదారులు గురువారం రక్తమోడాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా మల్యాల పరిధిలోని ముత్యంపేట వద్ద పెళ్లికారును డీసీఎం ఢీకొనడంతో చిన్నారి మృతి చెందగా.. పెళ్లి కుమారుడు సహా.. ఆరుగురు గాయపడ్డారు. ఇదే జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో ట్రాక్టర్ బోల్తాపడి తండ్రి మృతి చెందగా.. కొడుకు గాయపడ్డాడు. మెట్‌పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి వద్ద లారీ ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. చిన్నారి గాయపడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని తుమ్మనపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ఒక డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. –వివరాలు 10లో..
రక్తమోడిన రహదారులు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి..
పలువురికి గాయాలు
ఇతర రాష్ట్రాల నుంచి..
గంజాయి కేసుల్లో నిందితులుగా ఎక్కువ శాతం కార్మికులు, యువకులే ఉంటున్నారు. గ్రానైట్ కంపెనీల్లో ఎక్కువ శాతం బిహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తుంటారు. వీరిలో కొందరు గంజాయి దిగుమతి చేసి ఇతర కార్మికులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. గంజాయి సేవించినా, సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు.
– నిరంజన్‌రెడ్డి, కరీంనగర్ రూరల్ సీఐ
‘బిహార్ నుంచి గంజాయి దిగుమతి చేసిన రాంపర్వేష్ సాయి(46)ని ఇటీవల కరీంనగర్ రూరల్‌సర్కిల్‌లోని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 1.20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు’.
‘బిహార్ రాష్ట్రంలోని నూర్జాపూర్ నుంచి గంజాయి దిగుమతి చేసుకున్న యువకుడిని ఇటీవల కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.’
కరీంనగర్ కమిషనరేట్‌లో గంజాయి కేసుల వివరాలు
సంవత్సరం కేసులు అరెస్టయిన పట్టుబడిన
వారు గంజాయి (కిలోలు)
2023 22 54 27.604
2024 39 86 128.179
2025(ఇప్పటివరకు) 09 17 5.386
మత్తుగా ప్రాణం తీస్తోంది!
మత్తుగా ప్రాణం తీస్తోంది!
మత్తుగా ప్రాణం తీస్తోంది!
మత్తుగా ప్రాణం తీస్తోంది!
మత్తుగా ప్రాణం తీస్తోంది!


