
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
కొత్తపల్లి: చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని ప్రకృతి ఎన్‌జీవో సంస్థ అధ్యక్షుడు గాలిపల్లి నాగేశ్వర్ సూచించారు. ప్రపంచ మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం రేకుర్తి సాన్వి జూనియర్ కళాశాల, డిఫెన్స్ అకాడమీలో మాదకద్రవ్య వినియోగం వల్ల జరిగే దుష్పరిణామాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కళాశాల కరస్పాండెంట్ ఎర్రంశెట్టి మునిందర్, ప్రిన్సిపాల్ సిరిపురం ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్: మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యతని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ ధనలక్ష్మి అన్నారు. మంగళవారం జెడ్పీ క్వార్టర్స్ డే కేర్ సెంటర్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పిల్లల్లో మాదకద్రవ్యాల వినియోగ నిర్మూలనకు శిక్షణ కార్యక్రమం, పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పిల్లలు, యువత అలవాటు పడుతున్నారని, గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాలని అన్నారు. రూరల్ సీడీపీవో సబితా, అర్బన్ సీడీపీవో లక్ష్మీనారాయణ, డీసీపీవో శాంత, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్, మెడికల్ డిపార్ట్‌మెంట్ డాక్టర్లు రంగారెడ్డి, పృథ్వీరెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాస్, కళింగ శేఖర్, విజయ్, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి