
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
కరీంనగర్‌కల్చరల్: ఆచార్య రవ్వ శ్రీహరి సంస్కృతాంధ్ర సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రానికి చెందిన బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్‌కు మహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫ ల్య పురస్కారం అందించారు. తెలుగు భాషా సాహిత్యంలో విశేష పరిశోధనకు గానూ పురస్కార కింద రూ.50వేల నగదు, జ్ఞాపికను పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిల్ ఎల్.నరసింహరెడ్డి అందజేశారు. ప్రొఫెసర్ యాదగిరి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, వెలి చాల కొండల్‌రావు, సీనియర్ సంపాదకుడు రామచంద్రమూర్తి, నగనూరి శేఖర్, గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, బీవీఎ న్.స్వామి, మాడిశెట్టి గోపాల్ పాల్గొన్నారు.
ఇంటర్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
చొప్పదండి: పట్టణంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకులంలో మిగిలిన జూనియర్ ఇంటర్ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ స్వాతి కోరారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 31వరకు గురుకుల సొసైటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వొకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని, దరఖాస్తు రుసుము కింద రూ.100 చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని, గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ సీవోఈ విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఈ అవకాశం ఉందని తెలిపారు.