మీ సేవలు చాలిక! | Sakshi
Sakshi News home page

మీ సేవలు చాలిక!

Published Sat, May 25 2024 1:00 AM

-

‘నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్ల కీలక బాధ్యతలను గతంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమితులైన వారు బిల్‌కలెక్టర్లుగా ఉద్యోగాలు నిర్వర్తించేవారు. నగరపాలకసంస్థ కావడంతో కోట్ల రూపాయల పన్నుల వసూళ్లు చేయాల్సి ఉండేది. వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి రూ.లక్షల్లో పన్ను వసూలు జరిగేది. అయితే పలువురు ఔట్‌సోర్సింగ్‌ బిల్‌కలెక్టర్లు పన్నుల వసూళ్లలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో ఒక్కోసారి బల్దియా ఉన్నతాధికారులు ఇరుకునపడిన ఉదంతాలూ ఉన్నాయి.’’

‘నగరంలోని రేకుర్తిలో నకిలీ పత్రాలతో భూకబ్జాకు పాల్పడిన నిందితులకు సహకరించారనే అభియోగంపై గత నెలలో నగరపాలకసంస్థ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌తో పాటు, బిల్‌కలెక్టర్‌ రాజులను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. ఈ వ్యవహారంలో ఆర్‌ఐ శ్రీకాంత్‌ను సస్పెండ్‌ చేయగా, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న బిల్‌కలెక్టర్‌ రాజును నగరపాలకసంస్థ నుంచి తొలగించి.. వారధికి సరెండర్‌ చేశారు.’’

Advertisement
 
Advertisement
 
Advertisement