మెడికో హెల్త్‌కేర్‌కు ‘శ్రీచైతన్య’ విద్యార్థుల ఎంపిక | Sakshi
Sakshi News home page

మెడికో హెల్త్‌కేర్‌కు ‘శ్రీచైతన్య’ విద్యార్థుల ఎంపిక

Published Sat, May 18 2024 8:35 AM

మెడిక

కరీంనగర్‌సిటీ: నగరంలోని మంకమ్మతోటలో గల శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం మెడికో హెల్త్‌ కేర్‌ సర్వీస్‌ కంపెనీ నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో 21 మంది విద్యార్థులు ఎంపికై నట్లు కళాశాల చైర్మన్‌ ముద్దసాని రమేశ్‌రెడ్డి తెలిపారు. 110 మంది చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొనగా వివిధ దశల్లో జరిగిన ఎంపిక ప్రక్రియలో 21 మంది ఉద్యోగాలు సాధించారని, వారికి వార్షిక వేతనం రూ.2.5లక్షలు ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా తమ సంస్థ పనిచేస్తోందని, ఏటా దాదాపు 100 మంది వివిధ బహుళ జాతి సంస్థలకు ఎంపిక కావడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్‌ ఎల్‌.శ్రీనివాస్‌, వి.స్వర్ణలత, వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, కళాశాల సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రానైట్‌ అసోసియేషన్‌

అడ్వయిజరీ కమిటీ ఎన్నిక

కొత్తపల్లి: గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ జిల్లా తాత్కాలిక అడ్వయిజరీ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కొత్తపల్లి మండలం ఎలగందుల పంచాయతీ పరిధిలోని గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో శుక్రవారం సభ్యులు సీహెచ్‌.శ్రీనివాస్‌, మధుసూదన్‌, అడ్డకేట్‌ వేణుగోపాల్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో 18 మంది సభ్యులతో కమిటీని నియమించారు. జిల్లా గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగే వరకు ఈ వర్కింగ్‌ కమిటీ పనిచేస్తుందని వారు ప్రకటించారు. అసోసియేషన్‌ సభ్యులుగా జువ్వాడి ప్రణీత్‌రావు, నరేన్‌ రాచకొండ, బూర సాగర్‌, గుడిపాటి సుదర్శన్‌రెడ్డి, విక్రం, టి.సతీష్‌రావు, పెద్ది సత్యనారాయణ, సోమినేని కనకయ్య, జుట్టు మధు, కె.సత్యనారాయణరెడ్డి, సోమినేని కరుణాకర్‌, ఆర్‌.మహేశ్‌కుమార్‌, షేక్‌ భాష, సిరి గోపాల్‌, సాగి సాగర్‌రావు, ఆర్‌.రామ్‌భూపాల్‌ రెడ్డి, టి.శ్యాం రావు, ఈశ్వర్‌రెడ్డి దువ్వాడిలు ఎన్నికయ్యారు.

గడువు దాటిన స్టాక్‌

విక్రయించొద్దు

చొప్పదండి: మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను డీఏవో శ్రీనివాస్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడువు దాటిన స్టాక్‌ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఏవో వంశీకృష్ణ, డీలర్లు ఉన్నారు.

వీరబ్రహ్మేంద్రస్వామి

ఆరాధనోత్సవాలు

హుజూరాబాద్‌: పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శుక్రవారం బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి జరిగి, 331 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవగ్రహ పూజ, హోమం, బ్రహ్మంగారి సజీవ సమాధి ఘట్టం, పూజా కార్యక్రమాలను కో టగిరి ప్రవీణ్‌ శర్మ చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు కస్తూరి నరేంద్రాచారి, మునిగంటి నాగరాజు, రావుల వేణు, తేలుకుంట్ల వేణు, శ్రీను, రావుల భిక్షపతి, స్వర్ణకార సంఘం, మనుమయ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గుగ్గిల రాజేంద్రప్రసాద్‌, పొన్నోజు సుధాకరాచారి, రంగు పండరి, వలబోజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మెడికో హెల్త్‌కేర్‌కు  ‘శ్రీచైతన్య’ విద్యార్థుల ఎంపిక
1/2

మెడికో హెల్త్‌కేర్‌కు ‘శ్రీచైతన్య’ విద్యార్థుల ఎంపిక

మెడికో హెల్త్‌కేర్‌కు  ‘శ్రీచైతన్య’ విద్యార్థుల ఎంపిక
2/2

మెడికో హెల్త్‌కేర్‌కు ‘శ్రీచైతన్య’ విద్యార్థుల ఎంపిక

Advertisement
 
Advertisement
 
Advertisement