
ఏఎంసీలో ధాన్యం చోరీ
సుల్తానాబాద్‌రూరల్: స్థానిక వ్యవసాయ మార్కె ట్‌లో అశోక్‌నగర్‌వాసి జునగరి కుమార్‌కు చెందిన ధాన్యం గురువారం రాత్రి చోరీకి గురైంది. సన్నరకం ధాన్యం మర పట్టించేందుకు ఏఎంసీలో ఆరబోశాడు. ఇందులో దాదాపు 8బస్తాల ధాన్యం చోరీకి గురైంది. ఈక్రమంలో స్థానిక మార్కండేయకాలనీలో వెతకగా ఓ ఆటోలో ధాన్యం బస్తాలు లభించాయి. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఏఎంసీ కార్యదర్శి హమీద్ సైతం చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
చేపలవేటకు వెళ్లి
మత్స్యకారుడి మృతి
రామగుండం: చేపల వేటకు వెళ్లి నీట మునిగి మత్సకారుడు మృతి చెందిన ఘటన లింగాపూర్ శివారు గోదావరినదిలో చోటు చేసుకుంది. అంతర్గాం ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. ఆబాది రామగుండానికి చెందిన బింగి వెంకటేశ్(50)తోపాటు మరో ముగ్గురు బంధువులు శుక్రవారం గోదావరినదిలోకి వెళ్లారు. చేపలుపట్టేందుకు వలలతో నదిలో తెప్పపై తిరుగుతున్నారు. తెప్పపై నిలబడి వల విసిరే క్రమంలో కాళ్ల తగిలి అదుపు తప్పిన వెంకటేశ్.. నీటిలో పడిపోయాడు. బంధువులు అప్రమత్తమై వెంకటేశ్‌ను నీటిలో నుంచి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఊపిరి ఆడక మృతిచెందాడు. మృతుడికి భార్య పద్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలు..
సారంగాపూర్(జగిత్యాల): కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం.. మండలంలోని ఒడ్డెరకాలనీ గ్రామానికి చెందిన గద్దల బక్కవ్వ (60) భర్త నర్సయ్య ఏడాది క్రితం మృతిచెందాడు. దీంతో బక్కవ్వ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ నెల 15న వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ సిలిండర్ రెగ్యూలేటర్ నుంచి మంటలు వెలువడి బక్కవ్వ చీరకు అంటుకున్నాయి. ఇంటి సమీపంలో ఉండే ఆమె బంధువులు మంటలు ఆర్పివేసి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎంబీఏ, ఎంసీఏ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ఎం విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి: శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన ఎంబీఏ, ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ఫలితాల్లో కొత్తపల్లి మండలం చింతకుంట శివారులోని ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సి.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఎంబీఏ మొదటి సెమిస్టర్‌లో గుంటి త్రివేణి 6.97, వేల్పుల శ్రీవాణి 6.73, ఎంసీఏలో ఏ.సుధీక్ష 8.0, వి.స్పందన 7 .9 సాధించగా, ఎంబీఏ మూడో సెమిస్టర్‌లో ఎం.హర్షిత 6.81, పి.నవ్య 6.73, ఎంసీఏలో వి.శ్రీజ 7.72, బి.సౌమ్య 7.58 జీపీఏలతో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించారన్నారు. ఈ సందర్భంగా మొదటి, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎం.తిరుపతిరెడ్డి అభినందించారు.
గుంతలో పడ్డ ట్రాక్టర్
జ్యోతినగర్(రామగుండం): రోడ్డుపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతను పూడ్చకపోవడంతో ట్రాక్టర్ ట్రాలీ అందులో పడింది. ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డులో చాలా రోజుల క్రితం సీసీ రోడ్డుపై గుంత ఏర్పడింది. స్థానికులు దా ని చుట్టూ ఇటుకలు రక్షణగా ఏర్పాటు చేశా రు. అయినా.. శుక్రవారం ఇసుక లోడ్‌తో వెళ్తు న్న ట్రాక్టర్ ట్రాలీ అందులోపడిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఏఎంసీలో ధాన్యం చోరీ