సుల్తానాబాద్: ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. పట్టణంలోని గాంధీనగర్‌లో ఉన్న ఎస్సారెస్పీ క్వార్టర్స్ వెనుక వైపు పైప్‌లైన్ పగిలి నీళ్లు వెళ్లకపోవడంతో కాలనీవాసులు ఎన్నికలను బహిష్కరిస్తామని తహసీల్దార్‌కు బుధవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గురువారం మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి జేసీపీ సహకారంతో లీకేజీ అయిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నామని, వెంటనే మరమ్మతు చేపట్టామని వివరించారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ ద్వారా నిత్యం వాటర్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు.