
ఎన్నికల ప్రచారంలో గదను చూపుతున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్/కొత్తపల్లి: కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే నష్టపోతామని కరీంనగర్ బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం నగరంలోని 36,53,54 డివిజన్లలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని, మరో ఐదేళ్లు సేవకుడిలా పని చేస్తానని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో చిచ్చుపెట్టి కేసీఆర్‌ను ఓడించి హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపేందుకు అక్కడి నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డి, కేవీ పీ, షర్మిల, పవన్ కల్యాణ్ బీజేపీ, కాంగ్రెస్ ముసుగులో హైదరాబాద్‌లో అడ్డా వేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి ఓటు వేస్తే భవిష్యత్ తరాల నోట్లో మట్టి కొట్టినట్లే అవుతుందన్నారు. మంత్రి గంగులకమలాకర్‌కు మద్దతుగా 35వ డివిజన్ లో కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ప్రచారం చేపట్టారు.
కమాన్‌పూర్, బద్దిపల్లిలో..
కొత్తపల్లి మండలం కమాన్‌పూర్, బద్దిపల్లి గ్రామాల్లో మంత్రి కమలాకర్ విస్తృతంగా ప్రచారం చేశా రు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ పిల్లి శ్రీలత, ఏఎంసీ చైర్మన్ మధు, వైస్‌చైర్మన్ రాజశేఖర్ ఉన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక..
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ నుంచి భారీగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కొత్తపల్లి, నగునూర్, కిసాన్‌నగర్, శర్మనగర్‌కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ యువకులు మంత్రి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. 14వ డివిజన్ కొత్త జైపాల్‌రెడ్డి మిత్రబృందం నుంచి శ్రావణ్ పటేల్ ఆధ్వర్యంలో 300 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీదేవి, షేక్‌ఇర్ఫాన్ పాల్గొన్నారు.
● కరీంనగర్ బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్