పెద్దకొడప్‌గల్: మండల పరిధిలోని హైవే పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతా ల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పెద్దకొడప్‌గల్ పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక నిఘా నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో పేకాట ఆడటం, మద్యం సేవించడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే ఈ డ్రోన్ సర్వైలెన్స్ ఉద్దేశమని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. నమ్మదగిన సమాచరం మేరకు కాటేపల్లిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించి, నలుగురిని పట్టుకుని వారి నుంచి రూ. 2,420, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


